ప్రధాని మోదీ ప్రస్థాన ప్రచార బైక్ ర్యాలీని ప్రారంభించిన పల్లా శ్రీనివాసరావు
రిపోర్టర్: వెంకట్
స్థలం: Andhra Pradesh
ప్రజా సేవలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇరవై ఐదు సంవత్సరాల ప్రయాణం, భారతదేశ అద్భుత ప్రగతి, ఆ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పాత్రను దేశవ్యాప్తంగా ప్రచారం చేసేలా తిరుపతి నుంచి వారణాసి వరకు కూటమి నేతలు తలపెట్టిన బైక్ ర్యాలీని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ బైక్ ర్యాలీ ద్వారా ప్రధాని మోదీ అందించిన సంక్షేమ పథకాలను, జాతీయ అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తామని కూటమి నాయకులు తెలిపారు. తిరుపతిలో అట్టహాసంగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై తమ మద్దతును ప్రకటించారు.