పాఠశలకు సెలవులు: ఏపీలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై ప్రకటన
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నవంబర్ నాల్గవ తేదీ అలాగే ఐదవ తేదీలలో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. పోలింగ్ కేంద్రాలుగా విద్యాసంస్థలను ఉపయోగిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలలోని విద్యాసంస్థలకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయని స్పష్టం చేశారు.