అమెరికా అధ్యక్ష ఎన్నికలు: మరోసారి బరిలోకి కమలా హారిస్
రిపోర్టర్: శివ
స్థలం: వాషింగ్టన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తెలిపారు. అయితే ఆమె భర్త డగ్ ఎమ్హాఫ్ వ్యక్తిగతంగా కొన్ని సందేహాలు వ్యక్తం చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. మరోవైపు డెమోక్రటిక్ పార్టీ దాతలు కొత్త అభ్యర్థిని పరిశీలించాలని కోరుతున్నట్లు రాజకీయ వ్యూహకర్త డొన్నా బ్రేజిల్ పేర్కొన్నారు.