గుర్గావ్‌లో బైకర్‌పైకి కారు దూసుకెళ్లిన భయానక ఘటన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హర్యానా

గుర్గావ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో మహిళా బైకర్‌ను కారు ఢీకొట్టి, కొద్దిదూరం ఈడ్చుకెళ్లిన భయానక ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో సియా అనే బైకర్ గాయపడ్డారు. ఆమె న్యాయపోరాటానికి సిద్ధమవుతుండగా, కారు యజమాని మనీష్ తన స్నేహితుడు కళ్యాణ్ సింగ్ కారు తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.