బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
బీఆర్‌ఎస్ నిర్వహించిన మాక్ అసెంబ్లీపై కాంగ్రెస్ కార్పొరేషన్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ నేతల తీరు ప్రసిద్ధ కామెడీ షోలతో పోటీ పడుతోందని, కేటీఆర్ 'డ్రామారావు' అంటూ ఎద్దేవా చేశారు. మాక్ అసెంబ్లీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. సురేఖను ఢిల్లీకి వెళ్లి తొక్కి వచ్చానంటూ ఆయన చేసిన సెటైర్లు కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.