రాజాపేట మండల కేంద్రంలో పట్టభద్రుల ఓటరు నమోదుకు హెల్ప్డెస్క్

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదేశాల మేరకు శనివారం పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ప్రత్యేకంగా హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో జన గణేష్, వెలిగేటి ధనుష్ అందుబాటులో ఉంటారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పిలుపునిచ్చారు.