ఖైరతాబాద్ టికెట్ పై స్పష్టం చేసిన కాంగ్రెస్ నేత విజయా రెడ్డి

రిపోర్టర్: అశోక్ స్థలం: Hyderabad

ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానం నాగేందర్ను జాతీయ రాజకీయాలకు పంపి తనకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ నాయకురాలు విజయా రెడ్డి కోరారు. పీజేఆర్ బిడ్డకు ఈసారైనా న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని, పీజేఆర్ పేరు లేనిది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ముందుకు వెళ్లదని ఆమె స్పష్టం చేసినట్లు Telugu Scribe వెల్లడించారు. నియోజకవర్గంలో పార్టీ విజయానికి పీజేఆర్ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.