కులవివక్షతో వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం

కులవివక్షతో వేధిస్తూ చంపేస్తామని బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పస్తం నాగమ్మ, సుగుణ లక్ష్మీపతి డిమాండ్ చేశారు. కాటి కాపరి వృత్తిని అడ్డుకుంటూ దాడులకు పాల్పడుతున్న వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఖమ్మం రూరల్ పోలీసులను ఆశ్రయించి తమ కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించాలని విలేకరుల సమావేశంలో వారు వేడుకున్నారు.