పింఛన్ బకాయిల చెల్లింపులపై అధికారుల జాప్యంపై హైకోర్టు కీలక తీర్పు

రిపోర్టర్: సురేష్ స్థలం: గుంటూరు

అధికారుల పరిపాలనాపరమైన జాప్యం వల్ల పింఛన్ లబ్ధిదారులు నష్టపోకూడదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చిచెప్పింది. దరఖాస్తు చేసుకున్న రోజు నుంచే పూర్తి స్థాయి బకాయిలు చెల్లించాలని జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన తాడిశెట్టి తిరుపతమ్మ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం, ఎనిమిది వారాల్లోగా పెండింగ్ బకాయిలను చెల్లించాలని అధికారులను స్పష్టంగా ఆదేశించింది.