యూరోప్ దేశాల్లో పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించాలి

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఫ్రాన్స్

పిల్లలపై సోషల్ మీడియా దుష్ప్రభావాలను అరికట్టేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ కీలక పిలుపునిచ్చారు. 15 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా వినియోగాన్ని ఐరోపా వ్యాప్తంగా నిషేధించే దిశగా యూరోపియన్ యూనియన్ ముందుకు సాగాలని ఆయన కోరారు. ఆన్‌లైన్ ముప్పు నుంచి పిల్లలను రక్షించడానికి కట్టుబడి ఉన్నామని మెక్రాన్ స్పష్టం చేశారు.