కర్నూలులో గణేష్ నిమజ్జనానికి 1700 మంది పోలీసులతో బందోబస్తు

రిపోర్టర్: నరేష్ స్థలం: కర్నూలు

కర్నూలు నగరంలో గణేష్ నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు 1,700 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. నిమజ్జన మార్గాలు మరియు ఘాట్ల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టామని, మంగళవారం నగరంలో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని ఆయన వెల్లడించారు. భక్తులు మరియు ప్రజలు పోలీసుల సూచనలను పాటించి సహకరించాలని ఎస్పీ కోరారు.