సైబర్ మోసాలపై పోలీసుల కొరడా: బాధితులకు తిరిగి నగదు జమ
రిపోర్టర్: విజయ్
స్థలం: చంపాపేట్
సైబర్ నేరాల నియంత్రణకు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని ఎస్.ఎస్. సదన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సాయి ప్రకాష్ గౌడ్ తెలిపారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్ లో ఎంఆర్ఎం పోర్టల్ ద్వారా బాధితులకు రెండు లక్షల ఏడు వేల ఎనిమిది వందల ముప్ పై ఎనిమిది రూపాయల నగదును తిరిగి చెల్లించినట్లు వెల్లడించారు. ఎన్సీఆర్పీ పోర్టల్ ద్వారా అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండి మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన పేర్కొన్నారు.