డిజిటల్ అగ్రికల్చర్‌లో ఏపీఎంఐపీకి అంతర్జాతీయ గ్లోబల్ అవార్డు
రిపోర్టర్: కిరణ్
స్థలం: అమరావతి
డిజిటల్ అగ్రికల్చర్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు గ్లోబల్ అవార్డును దక్కించుకుంది. దిల్లీలో జరిగిన డ్రైల్యాండ్ కాంగ్రెస్ సదస్సులో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల చేతుల మీదుగా ఏపీఎంఐపీ పీడీ వెంకటేశ్వర్లు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ-గవర్నెన్స్ ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఈ ప్రాజెక్టు చూపిన చొరవకు ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించింది.