తప్పిపోయిన మహిళ ఆచూకీ: కుటుంబ సభ్యులకు అప్పగించిన రాజాపేట పోలీసులు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల కేంద్రంలో రెండు వందల కిలోమీటర్ల దూరంలో తప్పిపోయిన మహిళ ఆచూకీని పోలీసులు గుర్తించారు. బాన్సువాడ నుంచి వచ్చిన ఆమెను సురక్షితంగా కుటుంబ సభ్యులకు చేర్చారు. ఈ ఘటనపై సర్పంచ్ ధర్మతేజ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అప్రమత్తంగా వ్యవహరించి సేవలు అందించిన సిబ్బందిని స్థానికులు అభినందించారు. మతిస్థిమితం లేని మహిళ క్షేమంగా చేరడంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.