ఆరోగ్య పరిరక్షణకు ఆయుర్వేద విధానాలే శ్రీరామరక్ష అంటున్న వైద్యులు
రిపోర్టర్: I am Farmer 🍅🌱
స్థలం: అచ్యుతాపురం
ఆహార నియమాలు, దినచర్య, ఋతుచర్య పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు తెలిపారు. బుధవారం హరిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించారు. ఆయుర్వేదం ఫర్ హెల్దియర్ టుమారో థీమ్‌పై అవగాహన కల్పించారు. రుతువులను బట్టి తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన నియమాలు, ఆరోగ్య జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ పి.ఎం. వినయ్‌కుమార్, పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ డి. షకీన తదితరులు పాల్గొన్నారు.