ఓట్ల వేటలో దూకుడు పెంచిన టీడీపీ అభ్యర్థి ఖైరున్

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఓబులవారిపల్లి

తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండల పరిధిలోని చెన్నరాజుపాడు గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి సుంకేసుల ఖైరున్ విజయమే లక్ష్యంగా సీనియర్ నాయకులు సుంకేసుల రెడ్డయ్య, చిన్నమని విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ ప్రచారంలో స్థానిక కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు.