గురుకుల ప్రిన్సిపల్ అసభ్య ప్రవర్తన.. విద్యార్థి తల్లిపై లైంగిక వేధింపులు

రిపోర్టర్: రమేష్ స్థలం: వికారాబాద్

వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని గురుకుల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. 9వ తరగతి విద్యార్థిని పరామర్శించేందుకు వచ్చిన తల్లితో ప్రిన్సిపల్ మెగావత్ నరేశ్ అసభ్యంగా ప్రవర్తించాడు. కారులో అగ్గనూర్ శివారుకు తీసుకెళ్లి ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. బాధితురాలి బంధువులు ప్రిన్సిపల్‌పై దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. యాలాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.