ముంపు ప్రాంతాల్లో పర్యటించి రైతన్నలకు భరోసానిచ్చిన ఎమ్మెల్యే కూన రవికుమార్
రిపోర్టర్: NANUPATRUNI RANJITH KUMAR
స్థలం: శ్రీకాకుళం
ఆమదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి మండలంలో వంశధార నది పరివాహక ప్రాంతాల్లో నీటిమట్టం పెరిగి ముంపునకు గురైన సిందువాడ, యరగం, తెలికిపెంట, లొద్దల కాగితాపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే కూన రవికుమార్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ముంపు పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఆయన, రైతులు మరియు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.