కేంద్ర ఆర్థిక మంత్రి భేటీతో నో యూపీఐ డే నిరసన విరమణ

రిపోర్టర్: నరేష్ స్థలం: ന്യൂഡൽഹി

యూపీఐ పేమెంట్స్పై మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధింపునకు వ్యతిరేకంగా తలపెట్టిన నో యూపీఐ డే నిరసనను ట్రేడర్లు విరమించుకున్నట్లు వర్తక సంఘాల నేతలు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో జరిగిన చర్చలు విజయవంతం కావడంతో ట్రేడర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. డిజిటల్ పేమెంట్స్ పరిమితి పెంపుతో పాటు పలు డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ట్రేడర్ల సంఘాలు స్పష్టం చేశాయి.