'సేవా సంకల్ప్ అభియాన్ ప్రారంభం': వారణాసిలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: వారణాసి

ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ లోని ఆయన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో బీజేపీ నేతలు, ఎన్డీఏ అగ్రనేతలు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ చేపట్టిన నెల రోజుల పాటు సాగే 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమం ప్రారంభమైంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని వారణాసి నుంచి గుజరాత్‌లోని మోదీ జన్మస్థలమైన వడ్ నగర్ వరకు బైక్ యాత్రను జెండా ఊపి ప్రారంభించనున్నారు.