కుప్పం అభివృద్ధి కోసం వివిధ సంస్థలతో కీలక ఎంఓయూలు

రిపోర్టర్: మహేష్ స్థలం: కుప్పం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమక్షంలో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో పలు సంస్థలతో కీలక ఒప్పందాలు కుదిరాయి. కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు మానస సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీతో పాటు కింబర్లైట్ కెమికల్స్ సంస్థతో ఎంఓయూలు చేసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా కుప్పం నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.