ది ట్రైటర్స్ రియాలిటీ షో హోస్ట్ గా తేజ సజ్జ అరంగేట్రం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ప్రముఖ ఇంటర్నేషనల్ రియాలిటీ గేమ్ షో ది ట్రైటర్స్ తెలుగు వెర్షన్ తో యువ హీరో తేజ సజ్జ హోస్ట్ గా అరంగేట్రం చేస్తున్నట్లు ప్రైమ్ వీడియో సంస్థ అధికారికంగా వెల్లడించింది. మోసాలు, వ్యూహాలు, రహస్య కూటముల నేపథ్యంలో సాగే ఈ హై-వోల్టేజ్ గేమ్ షో అక్టోబరు 15 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.