మార్స్ యాత్రకు ఎలన్ మస్క్ మాస్టర్‌ప్లాన్ ఇదే!
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: World
భూమిపై ఇంటర్నెట్ వ్యాపారంతో వచ్చే సంపాదనతోనే అంగారక గ్రహంపైకి మనుషులను పంపాలన్నది ఎలన్ మస్క్ మాస్టర్ ప్లాన్. స్టార్‌షిప్ రాకెట్ల ద్వారా స్టార్‌లింక్ శాటిలైట్లను కక్ష్యలోకి పంపి భారీగా ఆదాయం ఆర్జిస్తోంది స్పేస్‌ఎక్స్. ఈ నిధులన్నింటినీ భవిష్యత్తులో మార్స్ యాత్రలు, అంతరిక్ష డేటా సెంటర్ల నిర్మాణం కోసం మస్క్ ఉపయోగిస్తున్నారు.