దేవుడి విగ్రహాలను జేసీబీలతో తొలగించడంపై కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: శివ స్థలం: Huzurabad

హుజురాబాద్లో నీటి కొరత కారణంగా జేసీబీలతో గణేష్ విగ్రహాలను పగలగొట్టడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, దేవుడి పవిత్ర విగ్రహాలను ఈ విధంగా ధ్వంసం చేయడం అత్యంత అమానుషమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది క్షమించరాని చర్య అని మండిపడ్డారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అధికారులు వ్యవహరించడంపై స్థానికంగా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.