భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎస్పీ హెచ్చరిక
రిపోర్టర్: రాము
స్థలం: పార్వతీపురం మన్యం
పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి ప్రజలను అప్రమత్తం చేశారు. రోడ్లపై నీరు నిలిస్తే నెమ్మదిగా వెళ్లాలని, నీటి ప్రవాహాలను దాటే సాహసాలు చేయవద్దు అని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వాగులు, వంకల వద్ద పోలీసు బీట్లు ఏర్పాటు చేసి ఎవరూ దాటకుండా తగు భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.