భూ సమస్యల పరిష్కారంలో జాప్యంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హెచ్చరిక

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ఖమ్మం

భూ సమస్యల పరిష్కారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి జాప్యాన్ని సహించేది లేదని పొంగులేటి శ్రీనివాస రెడ్డి - మంత్రి, పాలేరు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని రెవెన్యూ, హౌసింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలకు సంబంధించిన పలు కీలక అంశాలపై సహచర మంత్రులు దామోదర రాజనర్సింహ మరియు ఇతర అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు కరాఖండీగా ఆదేశాలు జారీ చేశారు.