ఢిల్లీ ఫైవ్స్టార్ హోటల్లో వాష్రూమ్ నిరాకరణ: నెట్టింట తీవ్ర చర్చ

రిపోర్టర్: వెంకట్ స్థలం: New Delhi

ఢిల్లీలోని ప్రఖ్యాత షాంగ్రి-లా హోటల్లో అత్యవసర సమయంలో మహిళకు వాష్రూమ్ సౌకర్యం నిరాకరించడంపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. ఈ ఘటనపై ఎక్స్ వేదికగా ఓ మహిళ వీడియో షేర్ చేయగా, నాన్-గెస్ట్లకు ప్రవేశం లేదనే నిబంధనలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 1867 నాటి చట్టాన్ని ప్రస్తావిస్తూ కొందరు వాదిస్తుండగా, మరికొందరు హోటల్ సిబ్బంది నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.