నాన్న ఇర్ఫాన్ ఖాన్ పెంపకంపై బాబిల్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
ఇంట్ లో ఎన్ని కార్లు ఉన్నప్పటికీ తనను బస్సులు, రిక్షాల్లోనే బడికి పంపేవారని ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ గుర్తుచేసుకున్నట్లు తెలిపారు. దర్శకురాలు ఫరా ఖాన్ తో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన తండ్రి సాధారణ జీవితాన్ని గడపాలని కోరుకునేవారని, ఆ విలువలే తనకు ఓర్పును నేర్పించాయని వెల్లడించారు. షూటింగ్స్ తో తండ్రి బిజీగా ఉన్నప్పుడు తల్లి సుతాప తన చిన్ననాటి ప్రతి క్షణంలో తోడుగా నిలిచారని ఆయన ఆవేదన, అభినందనల మధ్య వివరించారు.