శ్రీరామనారాయణంలో అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం శ్రీ రామనారాయణంలో మంగళవారం శ్రీ అభయాంజనేయ స్వామి వారికి తమలపాకులు, సింధూరంతో ప్రత్యేక అష్టోత్తర అర్చన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాగదేవతకు భక్తులు భక్తిశ్రద్ధలతో పాలాభిషేకం పూజా కార్యక్రమాలు జరిపారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు, సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని, పూజా కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.