స్పీకర్ గడ్డం ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీల దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నేతలు

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్లు

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలోని రాజీవ్గాంధీ చౌరస్తాలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్కుమార్రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ నాయకులు దహనం చేశారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. దళిత వర్గానికి చెందిన స్పీకర్ను అవమానించడం రాజ్యాంగ పదవికి తీవ్ర భంగకరమని, ఎమ్మెల్సీలు వెంటనే క్షమాపణ చెప్పాలని కసిరెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.