పల్నాడు జిల్లాలో క్వారీ గుంతలోపడి ఇద్దరు చిన్నారులు మృతి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: పల్నాడు

పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొండమోడులో క్వారీ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తల్లితో కలిసి దుస్తులు ఉతకడానికి వెళ్లిన గౌతమ్ (7), సతీశ్ (13) ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిపోయారు. కుటుంబ సభ్యులు వారిని వెలికితీసి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కన్నపేగు కోల్పోయిన ఆ తల్లి రోదనలు స్థానికులను తీవ్రంగా కలచివేశాయి.