కేంద్ర ప్రభుత్వ నివేదికల్లో డెంగ్యూ మరణాల గణాంకాలపై తీవ్ర గందరగోళం

రిపోర్టర్: మహేష్ స్థలం: తెలంగాణ

దేశంలో ప్రాణాంతక డెంగ్యూ వ్యాధి మరణాల గణాంకాలపై కేంద్ర ప్రభుత్వ శాఖల నివేదికల్లో భారీ వ్యత్యాసాలు వెలుగుచూశాయి. కేంద్ర వైద్యారోగ్య శాఖ నివేదిక ప్రకారం 2024లో తెలంగాణలో ఒక్క డెంగ్యూ మరణం నమోదుకాలేదని తెలపగా, రిజిస్ట్రార్ జనరల్ నివేదికలో తెలంగాణలో 47, ఏపీలో 60 మంది మరణించినట్లు అధికారికంగా తేలింది. సమాచార సేకరణ పద్ధతుల్లోని లోపాల వల్లే ఈ భారీ వ్యత్యాసాలు వస్తున్నట్లు విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.