పరిశ్రమల భాగస్వామ్యంతో నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ, సర్టిఫికెట్ల జారీ
రిపోర్టర్: సునీల్
స్థలం: ఆంధ్రప్రదేశ్
పరిశ్రమల్లో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతను తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త విధానాన్ని చేపట్టింది. ఎన్‌సీవీఈటీ సహకారంతో ఈ ఏడాది 25 పరిశ్రమల్లో ప్రయోగాత్మకంగా శిక్షణ, మదింపు ప్రక్రియను ప్రారంభించనున్నారు. విశాఖ, తిరుపతి సహా పలు జిల్లాల్లో గుర్తించిన పరిశ్రమల ద్వారా ఇచ్చే ఈ సర్టిఫికెట్లకు అంతర్జాతీయ గుర్తింపు ఉంటుంది. ఇవి పది, ఇంటర్, డిప్లొమా విద్యార్హతలకు సమానమైన హోదాను కలిగి ఉంటాయి.