ఫాక్స్ బ్రాడ్కాస్ట్లో అనుచిత వ్యాఖ్యలపై టామ్ బ్రాడీ క్షమాపణలు

రిపోర్టర్: నరేష్ స్థలం: Dallas

ఫాక్స్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారంలో అనుచిత పదజాలం ఉపయోగించడంపై అమెరికా ఫుట్బాల్ దిగ్గజం టామ్ బ్రాడీ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. డల్లాస్ కౌబోయ్స్ మ్యాచ్ సందర్భంగా తాను మాట్లాడిన తీరు పట్ల కాస్త సిగ్గుపడుతున్నానని టామ్ బ్రాడీ వెల్లడించారు. భవిష్యత్తులో ప్రసారాల సమయంలో ఇలాంటి పదాలు రాకుండా జాగ్రత్త పడతానని ఆయన స్పష్టం చేశారు. క్రీడా విశ్లేషణలో భాగంగా వచ్చిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.