నెత్తురోడిన జాతీయ రహదారిపై రక్తపు ముద్దలైన నిండుజీవితాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: బుచ్చిరెడ్డిపాలెం
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ముంబై జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆటోను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో చెల్లాయిపాలెం గ్రామానికి చెందిన వీరేంద్ర, దినేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.