పలాసలో వైభవంగా సాగిన వార్డు ఆత్మీయ సమ్మేళన వేడుక

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పదిహేడో వార్డులో వార్డు ఇన్చార్జి నిత్యానంద పండా ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వార్డులోని ప్రముఖులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా నిత్యానంద పండా మాట్లాడుతూ రానున్న స్థానిక ఎన్నికల్లో వార్డు అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.