తమిళనాట మారుతున్న రాజకీయాలు: ప్రధాని మోదీ పర్యటనలో కనిపించని నిరసనలు
రిపోర్టర్: గోపి
స్థలం: చెన్నై
తమిళనాడు రాజకీయ వేదికపై దశాబ్దాలుగా నడుస్తున్న సిద్ధాంత పోరాటంలో నిశ్శబ్ద విప్లవం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తమిళనాడులో పర్యటించిన సమయంలో గతంలో మాదిరిగా నల్ల బెలూన్లు గానీ, నిరసనలు గానీ ఎక్కడా కనిపించలేదని వారు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ప్రముఖులు పాల్గొనడం, రాజకీయ వైరుధ్యాలను పక్కనబెట్టడం వంటి పరిణామాలు రాష్ట్రంలో వస్తున్న గుణాత్మక మార్పునకు అద్దం పడుతున్నాయని విశ్లేషకులు స్పష్టం చేశారు.