అటకెక్కిన రాజీవ్ యువ వికాసం పథకం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కామారెడ్డి
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అటకెక్కింది. నాగిరెడ్డిపేట్ మండలంలో 1,495 దరఖాస్తులు ఆమోదించినా, గత 16 నెలలుగా నిధులు విడుదల చేయకపోవడంతో యువత ఆందోళన చెందుతోంది. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే పథకాన్ని నిలిపివేయడంతో నిరుద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురైంది.