పలాసలో కొండపై నుంచి ముంచెత్తిన వరదతో ఇళ్లలో చేరిన నీరు
రిపోర్టర్: Dinesh panda
స్థలం: పలాస
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని జయరామచంద్రపురంలో భారీ వర్షం కారణంగా కొండపై నుంచి పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి ఇళ్లలోకి చేరింది. స్థానికులైన బద్రి నారాయణ్, పిన్నింటి నాగేశ్వరరావు ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో నిత్యావసర సరుకులు, బట్టలు పూర్తిగా తడిసిపోయాయి. తాము ఇంతటి ఉద్ధృతమైన వరదను ఎప్పుడూ చూడలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణమే అధికారులు స్పందించి ఆదుకోవాలని కోరారు.