అమెరికాలో ఘనంగా ప్రాచీన బౌద్ధ సదస్సు: రాయబారి వినయ్ క్వాత్రా కీలక ప్రసంగం

రిపోర్టర్: కిరణ్ స్థలం: న్యూయార్క్

న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో ప్రాచీన కాలం నుంచి నేటి వరకు బౌద్ధం అనే అంశంపై ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహించినట్లు రాయబారి వినయ్ క్వాత్రా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ మేధావులు, బౌద్ధ గురువులు హాజరై బౌద్ధమత విస్తరణపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భారతదేశం తన బౌద్ధ వారసత్వాన్ని పరిరక్షించడానికి చేపడుతున్న చర్యలను ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.