తెలుగు యూనివర్సిటీ వివాదం: ఏపీ ఎమ్మెల్యే ఎంపికపై తీవ్ర నిరసనలు
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ విశిష్ట పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేను ఎంపిక చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ కళాకారులను విస్మరించి ఏపీ వారికి పురస్కారం ఇవ్వడంపై పలువురు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎంపికను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ వాదులు, కళాకారులు డిమాండ్ చేస్తున్నట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి.