తెలంగాణ ఉద్యోగ జేఏసీలో భగ్గుమన్న అంతర్గత విభేదాలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీలో ఆధిపత్య పోరు, అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. సీఎం, స్పీకర్‌తో భేటీ అంశంపై వాట్సాప్ వార్ తారస్థాయికి చేరింది. చలో హైదరాబాద్ వాయిదాపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ పదవుల ఆశతో ప్రచారం చేస్తే చర్యలు తప్పవని, ఇష్టం లేని వారు బయటకు వెళ్లొచ్చని జేఏసీ నాయకత్వం హెచ్చరించింది.