స్థానిక ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్‌రేట్‌తో విజయం సాధిస్తాం: పీవీఎన్ మాధవ్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: విజయవాడ
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు సమన్వయంతో ముందుకెళ్లి వంద శాతం స్ట్రైక్‌రేట్‌తో విజయం సాధిస్తాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో అభ్యర్థుల బలాబలాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. సీట్ల పంపిణీపై త్వరలో మూడు పార్టీల నేతలు సమావేశమై సమగ్ర కార్యాచరణ రూపొందిస్తారని వెల్లడించారు. మెగా డీఎస్సీపై వైకాపా కావాలనే రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.