ముఖ్యమంత్రి విజయ్ కార్యాలయ మార్పుపై బీజేపీ తీవ్ర విమర్శలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: తమిళనాడు
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కార్యాలయాన్ని తాత్కాలికంగా మార్చేందుకు రూ.6.17 కోట్లు వెచ్చించడంపై బీజేపీ రాష్ట్ర చీఫ్ నైనార్ నాగేంద్రన్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది ప్రజాధనం వృధా చేయడమేనని ఆర్టీఐ సమాచారం ద్వారా ఆయన ఆరోపించారు. శాసనసభ మీ సినిమా స్టూడియో కాదని, రైతులు కష్టపడుతుంటే లగ్జరీ కోసం కోట్లు ఖర్చు చేయడం తగదని ఆయన ఘాటుగా విమర్శించారు.