భారీ షాక్: భారత్ తో వన్డే సిరీస్ కు దూరమైన కీలక ఆటగాళ్లు

రిపోర్టర్: సునీల్ స్థలం: Auckland

భారత్ తో జరగనున్న వన్డే సిరీస్ కు న్యూజిలాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని ఆ జట్టు ప్రధాన కోచ్ రాబ్ వాల్టర్ తెలిపారు. మార్క్ చాప్మన్, రచిన్ రవీంద్ర గాయాల కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యారని ఆయన పేర్కొన్నారు. వారి స్థానంలో హెన్రీ నికోల్స్, మాట్ ఫిషర్, డీన్ ఫాక్స్ క్రాఫ్ట్ లను ఎంపిక చేసినట్లు సెలక్టర్లు వెల్లడించారు. ఈ మార్పులు జట్టుకు కొంత ఇబ్బందికరంగా మారాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.