డిజిటల్ సర్వేను సద్వినియోగం చేసుకోవాలని కోరిన వ్యవసాయ విస్తరణాధికారి

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ పంట నమోదు సర్వే కార్యక్రమాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా మొటాకొండూర్ మండలంలోని చాడ రెవిన్యూ పరిధిలోని ఆరు గ్రామాల రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి డి. వెంకటేష్ కోరారు. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక సిబ్బంది నేరుగా పొలాల వద్దకు వెళ్లి సాగు వివరాలు నమోదు చేస్తున్నారని తెలిపారు. ఈ నెల ముప్పైవ తేదీ వరకు ఈ నమోదుకు అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.