వినాయక చవితి పందిళ్ల అనుమతుల కోసం ఏపీలో ఆన్‌లైన్ పోర్టల్

రిపోర్టర్: సునీల్ స్థలం: Andhra Pradesh

వినాయక చవితి వేడుకల కోసం మండపాలు, పందిళ్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పోలీస్, ఫైర్ శాఖల అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఏపీ పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన 'సింగిల్ విండో' ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తుదారులు సులభంగా అనుమతులు పొందవచ్చు. పండుగ ఏర్పాట్లను మరింత పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసేందుకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.