అటవీ భూముల్లో సిలికా తవ్వకాలు: చిల్లకూరు మండలంలో ప్రజల తీవ్ర వ్యతిరేకత

రిపోర్టర్: కృష్ణ స్థలం: Tirupati

తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని మోమిడి రెవెన్యూ పరిధిలో అటవీ భూములను సిలికా తవ్వకాలకు కేటాయించడాన్ని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. సర్వే నంబరు 696లోని సుమారు తొంభై రెండు ఎకరాల భూమిలో మైనింగ్ అనుమతుల కోసం కొందరు ప్రయత్నిస్తున్నారని, దీనివల్ల తీరప్రాంత గ్రామాలు తీవ్ర ప్రమాదంలో పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ, తాజాగా ప్రజాభిప్రాయ సేకరణ జరగడంతో తీర ప్రాంత ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.