ప్రియుడి వేధింపులతో వీడియో కాల్స్ లోనే ఆత్మహత్య చేసుకున్న యువతి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: నాగ్‌పూర్
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వివాహం చేసుకునేందుకు ప్రియుడు నిరాకరించడంతో పాటు సోషల్ మీడియాలో ఫొటోలు పెడతానని బెదిరించడంతో మనస్తాపం చెంది అంజలి అనే యువతి వీడియో కాల్ మాట్లాడుతుండగానే ఆత్మహత్య చేసుకుంది. ధాంతోలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.