ఐఫోన్ 18 ప్రో స్క్రీన్‌లపై నిలువు గీతల సమస్య వస్తోందన్న టెక్ నిపుణులు
రిపోర్టర్: సురేష్
స్థలం: తెలంగాణ
ఇటీవల మార్కెట్లోకి విడుదలైన నూతన యాపిల్ ఐఫోన్ 18 ప్రో మరియు ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్ల డిస్‌ప్లేలపై పచ్చ, గులాబీ, ఎరుపు రంగుల్లో నిలువు గీతలు వస్తున్నట్లు కొందరు వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. భారత్‌తో పాటు పలు దేశాల్లో ఈ సమస్య వెలుగుచూసినట్లు సోషల్ మీడియా పోస్టులు స్పష్టం చేస్తున్నాయి. శాంసంగ్ సరఫరా చేసిన డిస్‌ప్లే ప్యానెళ్ల కారణంగానే ఈ లోపం తలెత్తి ఉండొచ్చని యూజర్లు అభిప్రాయపడుతుండగా, యాపిల్ సంస్థ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు.